30, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆట ఆడండి - సంధి పదాలను వేరు చేయండి

Jiigsaw - 6 ; నేనంటే అందరికీ హడల్

Jigsaw - 5 ; నా మీదుగా నడచిపోతారా? రండి!

Jigsaw - 4 ; నన్ను చూడగలరా?

Jigsaw - 3 ; నన్ను చూడగలరా?

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

Jigsaw puzzle - cycle riding

Jigsaw game - Eagle

Padakeli - 4

Sataka madhurima -

28, సెప్టెంబర్ 2020, సోమవారం

telugu sandhulu

                                       సంధులు

సంధి వివరణ:

            మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.  'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని సంధి అంటారు.
              ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది. వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను సంధి అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధికార్యము  అని అంటారు.  సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిలో మొదటి పదాన్ని 'పూర్వ పదం' అని రెండో పదాన్ని 'పరపదం'అని లేదా 'ఉత్తర పదం' అంటారు. పూర్వ పదం లోని చివరి అక్షరంలోని అచ్చును 'పూర్వ స్వరం' అని, పర పదంలోని మొదటి అక్షరం లోని అచ్చుని 'పర స్వరం' అని అంటారు. 
              సంధులు రెండు రకాలు. తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులని, సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులని అంటారు.

                                  తెలుగు సంధులు 

  అత్వసంధి (అకార సంధి)

  సూత్రం:- అత్తునకు సంధి బహుళము
             'అ' అనే హ్రస్వాక్షరానికి (ఆత్తు)అచ్చు పరమైనప్పుడు అత్వ సంధి ఏర్పడుతుంది.   బహుళము అంటే పలు విధాలుగా జరుగుతుంది అని అర్థం.

                         అందకుంటే     =    అందక + ఉంటే 
                         జరగకేమి        =    జరగక + ఏమి 
                         చాలినంత       =    చాలిన + అంత
                         లేకుంటే          =    లేక + ఉంటే

           మొదటి ఉదాహరణలో పూర్వ పదం'అందక' లోని చివరి అక్షరం 'క'లోని స్వరం 'అ'తో; పరపదం 'ఉంటే' లోని మొదటి స్వరం 'ఉ' కలిసినప్పుడు పూర్వ పదం లోని చివరి స్వరం లోపించి పర పదంలోని మొదటి స్వరం ఆ స్థానంలో వచ్చి 'కు' గా మార్పు చెందినది.
   పరిశీలిస్తే మిగిలిన అన్ని పదాలలో కూడా పూర్వస్వరం అయిన 'అ', పరస్వరంతో కలిసినప్పుడు పూర్వ స్వరం లోపించి పరస్వరం రూపం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
  పై సంధి పదాలలోని పూర్వ పదాలలో (అందక, జరగక, చాలిన, లేక) చివరి అక్షరంలో 'అ'(అత్తు) ఉంది. దీనికి పరపదం లోని అచ్చు పరమౌతూ ఉంది. 

 ఉదాహరణలు..

  అరచినట్టి      =   అరచిన + అట్టి

  అందకుంటే    =   అందుకే + ఉంటే

  అందుటను     =   అందుట + అను

  అనగనగ       =   అనగ + అనగ

  అన్నట్లు         =   అన్న + అట్లు

  అయినప్పటికీ   =   అయిన + అప్పటికీ

  ఇంకొకరు     =   ఇంక + ఒకరు

  ఈయనెవరు   =   ఈయన + ఎవరు

  ఉంచినప్పుడు  =   ఉంచిన + అప్పుడు

  ఉన్నప్పుడు     =   ఉన్న + అప్పుడు

  ఊరకుండు    =   ఊరక + ఉండు

  ఎంతైనా       =   ఎంత + అయినా

  ఏలందు       =   ఏల + అందు

  ఒకప్పుడు      =   ఒక + అప్పుడు

  ఒకింత        =   ఒక + ఇంత

  ఒక్కొక్కప్పుడు =   ఒక్కొక్క+ అప్పుడు

  ఒక్కొక్కరు    =   ఒక్క + ఒక్కరు

  కాకున్న       =   కాక + ఉన్న

  కావలసినంత. =  కావలసిన + అంత

  చింతాకు      =  చింత + ఆకు

  చిన్నప్పుడు     =  చిన్న + అప్పుడు

  చిన్నప్పటి      =  చిన్న + అప్పటి

  చెప్పకున్న     =  చెప్పక + ఉన్న

  చేసినంత     =  చేసిన + అంత

  జీవగడ్డయి    =  జీవగడ్డ + అయి

  తనంత       =   తన + అంత

  తలెత్తవచ్చు   =   తల + ఎత్తవచ్చు

  తాకినప్పుడు  =   తాకిన + అప్పుడు

  తెలిసినంత   =   తెలిసిన + అంత

  నాయనమ్మ   =  నాయన + అమ్మ

  పక్కనున్న     =  పక్కన + ఉన్న

  పట్టినంత      =  పట్టిన + అంత

  పడుటెంతయు =  పడుట + ఎంతయు

  పుట్టినప్పటి    =  పుట్టిన + అప్పటి

  పోలినట్లు      =  పోలిన + అట్లు

  పోవుటేమి     =  పోవుట + ఏమి

  భాగ్యసీమయి  =  భాగ్యసీమ + అయి

  బాధేదో       =   బాధ + ఏదో

  మొలకెత్తు     =   మొలక + ఎత్తు

  మేనల్లుడు     =   మేన + అల్లుడు

  లేకున్న        =   లేక + ఉన్న

  లేకుండు      =   లేక + ఉండు

  లేకేమి         =  లేక + ఏమి

  వంటాముదం  =  వంట + ఆముదం

  వారములందు =  వారముల + అందు

  వాళ్ళమ్మ        =  వాళ్ళ + అమ్మ

  వెళ్ళినప్పుడు    =  వెళ్ళిన + అప్పుడు

  రామయ్య       = రామ  + అయ్య 

                 అత్వసంది pdf  కోసం కింది డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి.
teluguteeram
Atvasandhi pdf file  

ఇత్వసంధి (ఇకార సంధి)

            

    సూత్రం:-
    ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికము.
     'ఇ' అనే  హ్రస్వాక్షరానికి అచ్చు పరమైనప్పుడు ఇత్వ సంధి ఏర్పడుతుంది.
  *వైకల్పికం అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అని అర్థం.
     
                *ఏమంటివి         =     ఏమి+అంటివి
                *వచ్చిరిపుడు        =     వచ్చిరి+ఇపుడు
                *మనిషన్నవాడు    =     మనిషి+అన్నవాడు
                *అదెట్లా              =     అది+ఎట్లా
    
    పై సంధి పదాలలోని పూర్వ పదాలలో (ఏమి, వచ్చిరి, మనిషి, అది) చివరి అక్షరంలో 'ఇ'(ఇత్తు) ఉంది. దీనికి పరపదం లోని అచ్చు పరమౌతూ ఉంది.


  

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

Vennela -3

                        వెన్నెల  చిట్టి పరీక్ష కోసం కింది లింకుని క్లిక్ చేయండి


                                                 వెన్నెల -3

23, సెప్టెంబర్ 2020, బుధవారం

19, సెప్టెంబర్ 2020, శనివారం

Nannechodudu

Nannaya

Tikkana

Yerrana

Telugu Ramayana kavulu

Sandhulu

Srinadhudu

 

Saivakavulu

God's gift of parents

         దేవుడు ఒక అమూర్త భావన. అయినా మనకు తెలిసిన, నచ్చిన రూపాలతో కొలుచుకుంటున్నాం. దేవుడే సర్వాంతర్యామి అని అందరి భావన. దేవుడు తల్లిదండ్రు...